కృష్ణ గారు, మహేష్ లని పరామర్శించిన మంత్రి తలసాని

Published on Sep 29, 2022 4:00 pm IST

సీనియర్ సినీనటులు సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి నిన్న తెల్లవారుఝామున అనారోగ్య కారణాలతో హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో ఒక్కసారిగా కృష్ణ గారి కుటుంబంతో పాటు యావత్ చిత్ర పరిశ్రమలో విషాధచాయలు అలముకున్నాయి. అనంతరం నిన్న మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్వహించారు. కాగా నేడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ గారి ఇంటికి విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ ధైర్యం చెప్తున్నారు.

ఇక కొద్దిసేపటి క్రితం తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్ నగర్ లోని కృష్ణ గారి నివాసానికి వెళ్లి కృష్ణ గారిని, మహేష్ బాబుని పరామర్శించి సంతాపాన్ని తెలిపి, ఇందిరాదేవి చిత్ర పటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కాగా కృష్ణ గారి ఇంటికి మంత్రి తలసాని వచ్చి వెళ్లిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :