రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి గ్రాండ్ పార్టీ ఇచ్చిన పొలిటీషియన్ !

20th, January 2017 - 04:58:10 PM

chiru
మెగాస్టార్ చిరంజీవి 9 ఎళ్ళ తర్వాత సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆయన అభిమానులు, ప్రేక్షకులు, సినీ జనాలకే కాక ఆయన సన్నిహితులకు కూడా చాలా సంతోషాన్నిచ్చింది. అలాంటి వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, సినీ రంగానికి అత్యంత దగ్గరి వ్యక్తి టి. సుబ్బరామిరెడ్డి కూడా ఉన్నారు. చిరంజీవి పునరాగమనాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు పార్క్ హయాత్ లో చిరంజీవికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీలో చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, చిత్ర నిర్మాత రామ్ చరణ్, ఉపాసన, నాగార్జున, ఛార్మి, పరుచూరి బ్రదర్స్, బి. గోపాల్, చిత్ర దర్శకుడు వినాయక్, అఖిల్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరు రీ ఎంట్రీ తనకెంతో ఆనందాన్నిచ్చిందంటూ టిఎస్సారీ చిరంజీవిని సతీసమేతంగా సత్కరించగా నాగార్జున మొదటి చిత్రంతోనే భారీ సక్సెస్ అందుకున్నందుకు నిర్మాత రామ్ చరణ్ ను సత్కరించారు. ఇకపోతే ఖైదీ నెం 150 చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది.