ఆ ఫేక్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన “టక్ జగదీష్” దర్శకుడు.!

Published on Jan 20, 2022 1:59 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి న్యూ ఏజ్ జెనరేషన్ దర్శకుల్లో ఎవరి మార్క్ తో వారు సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అలా తన కెరీర్ దర్శకునిగా మొదటి రెండు సినిమాలతోనే భారీ హిట్స్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ. రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని తో “టక్ జగదీష్” అనే సినిమాతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియెన్స్ కి మంచి సినిమా చూపించి ప్రశంసలు అందుకున్నాడు.

అయితే తర్వాత సినిమాగా తనకి బాగా కలిసొచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ తోనే వస్తానని చెప్పాడు. మరి ఇదిలా ఉండగా తనపై వైరల్ అవుతున్న ఒక ఫేక్ న్యూస్ పై తాను ఒక క్లారిటీ ఇచ్చారు. శివ నెక్స్ట్ ప్రాజెక్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో క్యాన్సిల్ అయ్యి విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడని సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారానికి స్పందిస్తూ అదంతా తప్పుడు వార్తలని కొట్టి పడేసాడు. మరి శివ అనుకున్న లవ్ స్టోరీ ఎవరితో తీస్తాడో క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :