బుల్లితెర పై ఆకట్టుకున్న టక్ జగదీష్..!

Published on Dec 2, 2021 3:01 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్తం టక్ జగదీష్. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం బుల్లితెర పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సందడి చేసింది.

బుల్లితెర పై ఈ సినిమా తన సత్తా చాటింది అని చెప్పాలి. స్టార్ మా లో ప్రసారం అయిన టక్ జగదీష్ చిత్రం 10.90 టీఆర్పీ ను సాధించడం జరిగింది. నాని కి ఫ్యామిలీ ఆడియెన్స్ అండ ఉందనేది ఈ రేటింగ్ తో మరొకసారి రుజువైంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు నిర్మించిన ఈ చిత్రం లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :