సెప్టెంబర్ 10 కి ప్రైమ్ వీడియో లో టక్ జగదీష్!?

Published on Aug 17, 2021 9:00 pm IST

శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దీని పై ఒక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో ఎప్పుడు విడుదల అవుతుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ విడియో లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఐశ్వర్య రాజేష్, దేవ దర్శిని జగపతి బాబు, నరేష్, వైష్ణవి చైతన్య, రావు రమేష్, రోహిణి లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :