ఆడియెన్స్ రిప్లైస్ చదువుతున్న “టక్ జగదీష్”

Published on Aug 31, 2021 4:01 pm IST


శివ నిర్వాణ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 1 వ తేదీన సాయంత్రం ఆరు గంటల కి నోవోటెల్ లో నిర్వహించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో నాని తన అభిమానులను, ప్రేక్షకులని ఇందులో భాగంగా అవ్వాలి అంటూ చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రొఫైల్ నేమ్ లో టక్ ను జత చేస్తూ, ట్రైలర్ నుండి ఏం చూడాలి అని అనుకుంటున్నారో వన్ వర్డ్ లో చెప్పమని తెలిపారు. అయితే నాని చేసిన ఈ ప్రయోగానికి సర్వత్రా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే పెద్ద పెద్ద హ్యండిల్స్ సైతం వాటి పేరుకి ముందుగా టక్ ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఆ రిప్లైస్ ను చదువుతూ నాని ఉన్న వీడియో ను అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా పోస్ట్ చేయడం జరిగింది. జగదీష్ రిప్లైస్ చదువుతున్నారు అని, ఇవన్నీ త్వరలో మన ముందుకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రాన్ని వినాయక చవితి శుభాకాంక్షల తో సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :