పోలీసులకు ఫోన్ చేసీ మరీ సూసైడ్ చేసుకున్న టీవీ నటి..!

Published on May 31, 2022 12:00 am IST

ప్రముఖ టీవీ నటి మైథిలీ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసులు తనకు న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకే వీడియో కాల్ చేసి లైవ్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే నటి మైథిలీ, తన భర్తతో కలిసి ఎస్.ఆర్. నగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో గతంలో ఓసారి పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది మైథిలీ. అయితే పోలీసులు ఇద్దరికీ సర్ధిచెప్పి పంపించేశారు.

అయితే తాజాగా మరోసారి మైథిలీ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తాను కొనుక్కున్న కారును బలవంతంగా తీసుకున్నాడని, అడిగినా ఇవ్వడం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతామని చెప్పగా.. ఇంటికి వెళ్లిన మైథిలీ తనకు న్యాయం జరగలేదంటూ పోలీసులకు వీడియో కాల్ చేఇ లైవ్‌లో సూసైడ్ చేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మైథిలీ ఇంటికి చేరుకుని ఆమెని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :