ట్విస్ట్: “మిస్టర్ బచ్చన్” ఆడియో విషయంలో ఏం జరుగుతుంది?

ట్విస్ట్: “మిస్టర్ బచ్చన్” ఆడియో విషయంలో ఏం జరుగుతుంది?

Published on Jul 6, 2024 1:09 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం తెలిసిందే. మరి సాలిడ్ బజ్ నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ కి సన్నద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై మేకర్స్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా ఆడియో హక్కులపై సాలిడ్ అప్డేట్ అందిస్తూ పాన్ ఇండియా టాప్ మోస్ట్ మ్యూజిక్ సంస్థ టి సిరీస్ వారు అయితే సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు రివీల్ చేశారు. ఇది కేబాగానే ఉంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇలా అనౌన్స్ చేసిన కొద్ది సేపటికే ఈ పోస్ట్ ని ప్రొడక్షన్ హౌస్ తొలగించారు. దీనితో ఆడియో లేబుల్ విషయంలో సస్పెన్స్ నెలకొంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా బజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు