వారం గ్యాప్ లో రెండు సినిమాలతో రానున్న యువహీరో !

వెంకి కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య నటించిన సినిమా ఈ నెల చివర్లో విడుదలకానుందని ప్రకటించారు కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇటివల విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది.

ఈ సినిమాతో పాటు నాగ శౌర్య ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కణం’ చిత్రంలో నటించాడు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరొయిన్ గా నటిస్తోంది. సస్పెన్స్‌తో నిండిన సన్నివేశాలతో ఉన్నసినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం వారం గ్యాప్ లోనే ఈ హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం.