ఐఫీస్ట్ : రెండు బడా ఫెస్టివల్స్ … రెండు మెగా మూవీస్ ….!!

Published on Jul 5, 2022 1:00 am IST

టాలీవుడ్ స్టార్ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో మెహర్ రమేష్ తీస్తున్న భోళా శంకర్ ఒకటి కాగా, బాబీ తెరకెక్కిస్తున్న మెగాస్టార్ 154 మూవీ మరొకటి, అలానే మోహన్ రాజా తీస్తున్న గాడ్ ఫాదర్ ఇంకొకటి. అయితే వీటిలో రాబోయే తెలుగు వారి పెద్ద పండుగల్లో ఒకటైన దసరా కానుకగా ముందుగా గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది.

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగాస్టార్ రోల్ అదిరిపోతుందని, దర్శకుడు మోహన్ రాజా మలయాళ ఒరిజినల్ మాతృకని మించేలా అద్భుతంగా మూవీ తీస్తున్నారని అంటోంది యూనిట్. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆపైన రానున్న పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ 154 మూవీ రిలీజ్ కానుంది.

వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో మెగాస్టార్ మరొక్కసారి మెగా బాస్ గా సూపర్ క్రేజ్ తో దూసుకెళ్లడం ఖాయం అని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ విధంగా రాబోయే దసరాకి, అలానే ఆపైన సంక్రాంతికి మెగాస్టార్ రెండు మూవీస్ రిలీజ్ అవుతూ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా మంచి ఐ ఫీస్ట్ ని అందివ్వనున్నాయి.

సంబంధిత సమాచారం :