ఈ శుక్రవారం వాయిదా పడిన రెండు పెద్ద సినిమాలు !
Published on Oct 27, 2017 5:20 pm IST

ప్రతి శుక్రవారం తప్పకుండ రెండో, మూడో సినిమాలు విడుదల అవుతాయి, పెద్ద హీరోల సినిమాలు అయితే ఒక రోజు గ్యాప్ తో విడుదల అవ్వడం సహజం. ఈ శుక్రవారం మొత్తం మూడు సినిమాలు విడుదల అవ్వాలి, ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘ఆక్షిజన్’ ‘అదిరింది’ కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ‘ఆక్సిజన్’ ‘అదిరింది’ విడుదల కాలేదు, దీంతో రామ్ సినిమాకు కొంత వరుకు మేలు జరగవచ్చని చెప్పాలి.

వచ్చే వారం ‘గరుడవేగా’ ‘ నెక్స్ట్ నువ్వే’ ఏంజెల్’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. అదిరింది సినిమా గత రెండు వారాల నుండి వాయిదా పడుతూ వస్తుంది. త్వరలో ఈ సినిమా విడుదల కొత్త తేదిని అనౌన్సు చెయ్యనున్నారు నిర్మాత. రాజ శేఖర్ నటించిన ‘గరుడవేగా’ ట్రైలర్ ఆకట్టుకుంది, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి, ఆది ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా తమిళ్ లో విజయం సాదించింది, తెలుగులో ఎలా ఉంటుందో చూడాలంటే వచ్చే శుక్రవారం వరుకు ఆగాల్సిందే.

 
Like us on Facebook