“అఖండ” రీమేక్ కోసం ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోలు పోటీ..!

Published on Jan 26, 2022 3:00 am IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి రాణించింది. కరోనా సమయంలో విడుదలైనప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని అన్ని చోట్ల భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట

తొలుత “అఖండ”ను డబ్బింగ్ చేసి బాలీవుడ్‌లో విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, బాలకృష్ణ ఇమేజ్ నార్త్‌లో పెద్దగా లేకపోవడంతో ఆ సాహసం చేయలేకపోయారు నిర్మాతలు. అయితే ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్‌లో ఇద్దరు హీరోలు పోటీపడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ ఇద్దరు మాస్ హీరోలు. అయితే వీరిద్దరిలో ఎవరికైన ఈ సినిమా ఫర్‌పెక్ట్‌గా సెట్ అవుతుందని అభిమానులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరిలో ఎవరో, ఒకరు అఖండ సినిమాను రీమేక్ చేయడం కాయంగా కనిపిస్తుంది

సంబంధిత సమాచారం :