“RRR” నుంచి ఈ రెండు డేట్స్ లో బిగ్ అప్డేట్స్..?

“RRR” నుంచి ఈ రెండు డేట్స్ లో బిగ్ అప్డేట్స్..?

Published on Feb 19, 2022 11:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇంకో నెల రోజుల్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ గ్యాప్ లో మేకర్స్ కాస్త సైలెంట్ గానే ఉన్నారు.

కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాక రెండు మూడు రోజులు హడావుడి కనిపించినా ఆ తర్వాత మాత్రం మధ్యలో ఎలాంటి అప్డేట్స్ లేవు.. కానీ ఇప్పుడు ఓ రెండు బిగ్ అప్డేట్స్ కి మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం రానున్న మార్చ్ 9 న మరియు 14 న రెండు బిగ్ అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ అప్డేట్స్ ఎలాంటివో ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు