ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ నడుమ “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్.!

Published on Sep 19, 2021 2:30 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “లవ్ స్టోరీ”. టాలెంటడ్ హీరో నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మాణం వహించారు. మరి ఎప్పుడు నుంచో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి ఈ సినిమా వచ్చే వారం గ్రాండ్ వెల్కమ్ చెబుతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ కి ఈవెంట్ కి గాను మేకర్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా ఇది వరకే తెలిసిందే. లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిగా వస్తున్నారని ముందు కన్ఫర్మ్ కాగా ఇప్పుడు చైతూ ఈ ఈవెంట్ లో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా పాల్గొననున్నట్టు తెలిపాడు.

దీనితో ఓకే స్టేజ్ పై ఇద్దరు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు సారథ్యంలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందివ్వగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సహా అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :