లేటెస్ట్..అజిత్ “వలిమై” నుంచి రెండు బిగ్గెస్ట్ అప్డేట్స్.!

Published on Sep 22, 2021 12:03 pm IST


కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “వలిమై” కోసం గత కొన్ని రోజులుగా సాలిడ్ బజ్ అలా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ బజ్ లోనే రేపు గురువారం ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసినట్టుగా వచ్చిన వార్త వైరల్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ టీజర్ విషయంలో ఓ లేటెస్ట్ అప్డేట్ తో పాటు మరో భారీ అప్డేట్ కూడా బయటకి వచ్చింది.

మొదటగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ కి రెడీ చేస్తుండగా నిర్మాత బోనీ కపూర్ మరో బిగ్ అప్డేట్ రివీల్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది వరకు ఈ ఏడాది దీవాళీ రేస్ లో ఉందని తెలియగా ఇప్పుడు దానిని సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. మరి అలాగే కొన్ని రోజుల్లో ట్రైలర్ మరియు ఈ రిలీజ్ డేట్స్ పై కూడా అప్డేట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :