“లైగర్” నుంచి రిలీజ్ డేట్ తో పాటు మరో బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Dec 16, 2021 10:50 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “లైగర్”. పాన్ ఇండియన్ లెవెల్లో అదిరే హంగులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రిస్టేజియస్ గా ప్లాన్ చేస్తున్నారు.

మొట్ట మొదటిసారిగా ఇండియన్ సినిమాలో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ని కూడా పరిచయం చేసి ఈ సినిమాపై హైప్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. దీనితో ఈ సినిమా రిలీజ్ పట్ల మరింత ఆసక్తి రేకెత్తింది. అయితే ఇపుడు ఈ సినిమా రిలీజ్ కి సరికొత్త డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు.

వచ్చే ఏడాది ఆగష్టు 22న భారీ స్థాయి రిలీజ్ ని కన్ఫర్మ్ చేయగా ఇంకో క్రేజీ అప్డేట్ ని కూడా రివీల్ చేశారు. ఈ డిసెంబర్ 31న ఈ సాలిడ్ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ మాస్ గ్లింప్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఛార్మి ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :