వావ్ : ‘ లైగర్ ‘ నుండి రెండు బ్లాస్టింగ్ అప్ డేట్స్

Published on Jul 6, 2022 6:48 pm IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై ఎంతో భారీ ఎత్తున నిర్మితమవుతున్న లైగర్ లో హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తుండగా తనిష్క్ బాగ్చి, విక్రమ్ మొంట్రోజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అందరి నుంచి సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకున్న లైగర్ నుంచి మొన్న రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్ కూడా ఆకట్టుకుని సినిమాపై మరితగా అంచనాలు పెంచింది.

ఇక ఈ మూవీ నుంచి జూలై 8న టీజర్ ని అలానే జూలై 11 న అక్డ పక్డి అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్ గా నటిస్తుండగా ఆయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇందులో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక సర్ప్రైజ్ రోల్ లో కపించనున్నారు. ఆగస్టు 25న భారీ ఎత్తున రిలీజ్ కానున్న లైగర్ తప్పకుండా అందరి అంచనాలు అందుకని పెద్ద బ్లాక్బస్టర్ సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :