“లవ్ స్టోరీ” కోసం రెండు క్లైమాక్స్‌లు చిత్రీకరించారా?

Published on Sep 22, 2021 10:36 pm IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” చిత్రం ఈ నెల 24వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే రెండు యాంగిల్స్‌లో క్లైమాక్స్‌లను చిత్రీకరించి, రెండిటికి సెన్సార్‌ను కూడా పూర్తి చేశారట. అంతేకాదు సినిమాలో రేప్, కులం, స్త్రీ-పురుష సమానత్వం అనే అంశాలపై అవేర్‌నెస్ కల్పించారని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది, ఏ క్లైమాక్స్ ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :