ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు ఫీల్ గుడ్ చిత్రాలు.!

ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు ఫీల్ గుడ్ చిత్రాలు.!

Published on Mar 17, 2023 7:01 AM IST

టాలీవుడ్ సినిమా దగ్గర ఈ ఏడాది ఈ గడిచిన రెండు నెలల వ్యవధి లోనే పలు ఆసక్తికర సినిమాలు వచ్చాయి. ఫ్యామిలి ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకునే విధంగా మన టాలీవుడ్ యంగ్ దర్శకులు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రాలు రెండు అయితే ఈరోజు నుంచి ఓటీటీ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ చిత్రాలు ఒకటి కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన “సార్” కాగా మరో చిత్రం మన టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ నటించిన “రైటర్ పద్మభూషణ్”.

ఈ రెండు సినిమాలు కూడా అనుకున్న దాని కన్నా పెద్ద హిట్స్ కాగా నేటి నుంచి అయితే ఈ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ధనుష్ సినిమా అయితే నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా ఇక రైటర్ పద్మభూషణ్ చిత్రం జీ 5 చూడవచ్చు. మరి ఫ్యామిలీ తో కలిసి చూడగలిగే ఈ రెండు ఫీల్ గుడ్ చిత్రాలు ఓటీటీ వీక్షకులను ఈ వారాంతంలో తప్పక అలరిస్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు