అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టిన తారక్, కళ్యాణ్ రామ్ !

7th, August 2017 - 08:31:54 AM


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ‘జనతా గ్యారేజ్ ‘ వంటి హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం, ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ మూడు పాత్రలని బలంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది వరకే విడుదలైన ‘జై’ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్, టీజర్ రెండూ అద్భుతంగా ఆకట్టుకోవడంతో మిగిలిన రెండు పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆతురత అందరిలోనూ ఎక్కువైంది.

ఈ క్రేజ్ మధ్యనే ఈ రోజు మరొక పాత్ర లవ ‘లవ’ కు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఉదయం 10: 35 లకు విడుదలకానుంది. అయితే ఈ పాత్ర కోసం రెండు లుక్స్ ను రెడీ చేశారని, అవి రెండూ బాగానే ఉన్నాయని, వాటిలో ఏదో ఒక్కదాన్నే రిలీజ్ చేయాలా లేకపోతే రెండింటినీ రిలీజ్ చేయాలా అనే చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నామని, ప్రస్తుతం ఈ విషయమై తారక్ తో చర్చలు చేస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపిన కళ్యాణ్ రామ్ ఇంతకీ రిలీజ్ చేసేది ఒకటా లేక రెండా అనే విషయాన్ని మాత్రం తేల్చలేదు. మరి ఈ సంగతి తేలాలంటే ఇంకొద్దిసేపు ఆగాల్సిందే.