రజినీకాంత్ ముందు ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయట.!

Published on Dec 21, 2021 5:00 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అన్నాత్తే” తో మళ్ళీ సదా సీదా హిట్ నే అందుకున్నారు. తన స్టార్డం కి తగ్గ సినిమా అయితే ఇది కాదని మాత్రం ప్రూవ్ అయ్యింది. ఇక దీనితో మళ్ళీ రజినీ నెక్స్ట్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తలైవర్ నెక్స్ట్ ఎవరితో చేస్తారు అనే దానికి సమాధానం ఉంది కానీ మళ్ళీ ఇదే దర్శకుడు శివతో ఇంకో సినిమా కమిట్ కాగా వేరే ఇద్దరు దర్శకులు రజిని లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారిలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్ కాగా ఇంకొకరు బల్కి తో అని తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరు ఒక్కో ఇంట్రెస్టింగ్ కథను తీసుకొచ్చారట.

కార్తీక్ సుబ్బరాజ్ మళ్ళీ “పేట” లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ ని తీసుకురాగా బల్కి మాత్రం ఓ సాలిడ్ సబ్జెక్టు ని తీసుకొచ్చారట. అయితే ఇదంతా చాలా రియలిస్టిక్ డ్రామాలా ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు లేకుండా కేవలం నటీనటుల పెర్ఫామెన్స్ ఆధారంగా ఉంటుందని తెలుస్తుంది. మరి వీటిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :