వచ్చే ఏడాది శంకర్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్.?

Published on Jun 9, 2022 3:00 am IST

ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ వస్తే చూడాలని ఇండియన్ వైడ్ ఉన్న మూవీ లవర్స్ అలాగే తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారీ స్థాయి హైప్ ఉండగా ఈ సినిమా అనంతరం మరికొన్ని చిత్రాలు తన లైనప్ లో ఉన్నాయి.

అయితే పలు కారణాల చేత చరణ్ తో కన్నా ముందు లోక నాయకుడు కమల్ హాసన్ తో “భారతీయుడు 2” ని కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కానీ అది పలు కారణాల చేత మధ్యలో ఆగిపోయింది. కానీ ఫైనల్ గా గొడవలు అయితే సర్దుమణిగి శంకర్ కి చరణ్ తో సినిమాపై లైన్ క్లియర్ కాగా నెక్స్ట్ భారతీయుడు 2 షూట్ మళ్ళీ స్టార్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు.

అయితే తాజాగా మళ్ళీ భారతీయుడు 2 షూటింగ్ పై లేటెస్ట్ టాక్ బయటకొచ్చింది. దీని ప్రకారం అయితే శంకర్ అతి త్వరలోనే ఈ సినిమాకి ఎంటర్ అవుతారని అలాగే బహుశా వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కూడా ఉండొచ్చని తెలుస్తుంది. అంటే ఇది, అలాగే 2023 ఫస్ట్ హాఫ్ లో చరణ్ సినిమా నెక్స్ట్ కమల్ సినిమాలతో శంకర్ నుంచి రెండు భారీ సినిమాల రిలీజ్ లు ఉంటాయని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. .

సంబంధిత సమాచారం :