లేటెస్ట్ క్లిక్ : ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మెగాస్టార్ డైరెక్టర్స్

Published on Jan 13, 2023 2:01 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ రేపు భారీ అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత ఈ మూవీలో మంచి మాస్ పాత్ర చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక రోల్ చేస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే విషయం ఏమిటంటే, రేపు వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ బాబీని ప్రత్యేకంగా కలిసిన మరొక యువ దర్శకుడు మెహర్ రమేష్, మూవీ సక్సెస్ పై ముందస్తు అభినందనలు తెలియచేస్తూ ఆయనతో ఒక సూపర్ పిక్ దిగారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ తో భోళా శంకర్ మూవీని మెహర్ రమేష్ తెరక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ మెగాస్టార్ సోదరిగా నటిస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరు మెగాస్టార్ డైరెక్టర్స్ కలిసి దిగిన ఈ సూపర్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :