రెండు కొత్త సన్నివేశాలతో ‘జనతా గ్యారేజ్’..!

janatha-garage-2
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాతో తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈవారం సెలవులు కూడా ఉండడంతో జనతా గ్యారేజ్ టీమ్ ఇప్పటికే సినిమా చూసి ఉన్న అభిమానులు మళ్ళీ చూసేలా కొత్తగా రెండు సన్నివేశాలను జతచేసింది. నిజానికి ఈ రెండు సన్నివేశాలను గురువారం రోజునుంచే జతచేయాలనుకున్నా టెక్నికల్ కారణాల వల్ల నిన్నట్నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో టాప్ లీగ్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ని ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. కొత్త సన్నివేశాలు జత చేరడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.