ఓటీటీలోకి మరో రెండు తెలుగు సినిమాలు వచ్చేసాయోచ్..!

Published on Nov 19, 2021 1:07 am IST


కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్ని థియేటర్లు తెరుచుకున్నప్పటి నుంచి పోటీ పడి మరీ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ బరిలో నిలుస్తుడడంతో ఏ సినిమా కూడా బాక్సాఫీసు బరిలో ఎక్కువ కాలం నిలబడడం లేదు. దీంతో కొన్ని సినిమాలు పది రోజులకే ఓటీటీ బాట పడుతున్నాయి.

అయితే తాజాగా రెండు తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఆహా వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లోకి రాగా, తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘అద్బుతం’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయబడుతుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో ప్రీమియర్‌ అవుతుంది.

సంబంధిత సమాచారం :