మెగా అభిమానులకు రెండు సప్రైజులు

మెగా అభిమానులకు మెగా హీరోల నుండి కొత్త సంవత్సరం కానుకగా రెండు సప్రైజులు ఉండనున్నాయి. అవి కూడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల నుండి కావడం విశేషం. మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ స్వయంగా పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ పాట ఈరోజే రిలీజ్ కానుంది.

ఇక అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తున్న బన్నీ, వక్కంతం వంశీల ‘నాపేరు సూర్య’ చిత్రం యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ కూడా రేపే రానుంది. మరి ఈ ఇంపాక్ట్ టీజర్ రూపంలో ఉంటుందా లేకపోతే అల్లు అర్జున్ యొక్క ఫస్ట్ లుక్ రూపమ్లో ఉంటుందా అనేది రేపే తెలియనుంది. ఇకపోతే వీటిలో ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న రిలీజ్ కానుండగా ‘నా పేరు సూర్య’ ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.