చిరు పుట్టినరోజునాడు అభిమానులకు రెండు కానుకలు !
Published on Aug 16, 2017 6:00 pm IST


ఈసారి జరగబోయే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాస్త ప్రత్యేకంగా ఉండనుంది. ప్రతి ఏటా చిరు జన్మదినం సందర్భంగా రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ గర్వకారణంగా నిలిచే అభిమానులకు ఈసారి చిరు ఏకంగా రెండు కానుకల్ని ఇవ్వనున్నారు. అవి ఒకటి 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కాగా మరొకటి మోషన్ పోస్టర్ విడుదల.

ఆగష్టు 22 ఉదయం 11 గంటల 30 నిముషాలకు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. అయితే ఈ పోస్టర్లో కేవలం టైటిల్ ను మాత్రమే చూపెడతారో లేకపోతే ఉయ్యాలవాడ లుక్ లో ఉన్న చిరంజీవిని కూడా చూపిస్తారో ఖచ్చితంగా తెలియరాలేదు. సురేందర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.

 
Like us on Facebook