మహేష్ సినిమాకు డిఫరెంట్ టైటిల్స్ !
Published on Oct 23, 2017 6:49 pm IST

ఇటీవలే ‘స్పైడర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమాలో నటిస్తున్నాడు. వీరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ భారీ హిట్టవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చెయ్యనున్నారు నిర్మాతలు.

ఈ సినిమా తరువాత మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. మహేష్ చేస్తున్న 25వ సినిమా ఇది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘కృష్ణా ముకుందా మురారి’ , ‘హరేరామ హరే కృష్ణ’ అనే రెండు టైటిల్స్ ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి రెండిటిలోనే ఏదో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని టాక్.

 
Like us on Facebook