వైరల్ : షారుఖ్ ఇంట్లోకి చొరబడ్డ యువకులు.!

Published on Mar 3, 2023 2:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “పఠాన్” తో తాను సెన్సేషనల్ కం బ్యాక్ ని అయితే అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ హిట్ తో షారుఖ్ అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా మారారు. షారుఖ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో గాని సినిమా రిలీజ్ అయ్యాక కూడా అభిమానులతో అనేక సార్లు ఇంటరాక్ట్ అయ్యారు.

మరి ఇదే అభిమానం షారుఖ్ కి ఇప్పుడు షాకిచ్చింది. ముంబై లోని తన నివాసం మన్నాట్ కి ఇద్దరు యువకులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేసారట. దీనితో సెక్యూరిటీ వారిని పట్టుకోగా తాము తమ అభిమాన హీరో షారుఖ్ ని చూసేందుకు గౌరత్ నుంచి వచ్చామని చెపుతున్నారట. అయితే ఇప్పుడు వారు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి అయితే షారుఖ్ పై అభిమానం ఇలా చేసింది. ప్రస్తుతానికి ఈ షాకింగ్ ఇన్సిడెంట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :