సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “స్కై ల్యాబ్”

Published on Nov 28, 2021 4:43 pm IST

సత్యదేవ్ హీరోగా విశ్వక్ ఖండేరావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్కై ల్యాబ్. ఈ చిత్రం ను డాక్టర్ కే రవి కిరణ్ సమర్పణ లో బైట్ ఫీచర్స్ నిత్యా మీనన్ కంపనీ తో కలిసి ఈ చిత్రాన్ని పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం విశేషం. డిసెంబర్ 4 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రి రిలీజ్ వేడుక కి న్యాచురల్ స్టార్ నాని వస్తున్నారు. నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, తరుణ్ భాస్కర్ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :