జనవరి నుండి సమంత సినిమా మొదలు !

9th, December 2017 - 03:15:12 PM

ప్రస్తుతం సమంత చేస్తోన్న సినిమాలు నాలుగు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ ‘రంగస్థలం’, ఈ సినిమాతో పాటు ‘మహానటి’ సావిత్రి బయోపిక్ లో నటిస్తోంది. ఇక, తమిళ్ లో శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తున్న ఈ హీరోయిన్ యు టర్న్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టబోతోంది.

కన్నడలో విజయవంతం అయిన ‘యు-టర్న్’ సినిమాను చెయ్యనుంది సమంత. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి నుండి మొదలుపెట్టబోతోంది సమంత. ఒరిజినల్ డైరెక్టర్ పవన్ ఈ సినిమాను తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సంభందించి మరిన్ని విషయాలు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా కు సంభందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుగుతోంది.