చిరంజీవి – ఉదయ్ కిరణ్ మధ్య జరిగింది ఇదే..!
Published on Jul 8, 2017 3:57 pm IST


ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకోవడానికి దారితీసిన అంశాల విషయంలో మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ లో వెనకబడిపోవడానికి కారణం చిరు కుమార్తెతో వివాహం ఆగిపోవడమే అనేది గతంలో వచ్చిన వార్తల సారాంశం. కాగా ఉదయ్ మరణించిన ఇన్ని ఏళ్ల తరువాత అతని సోదరి శ్రీదేవి అనేక విషయాలు వెల్లడించారు. చిరు, ఉదయ్ ల మధ్య జరిగిన విషయాల గురించి ఆమె మాట్లాడారు.

ఉదయ్ కిరణ్ మానసికంగా కుంగిపోయి ఉన్న సమయంలో చిరంజీవి అందించిన ప్రోత్సాహం గురించి ఆమె తెలపడం విశేషం. ఉదయ్ కిరణ్ గతం లో ఓ యువతిని ప్రేమించాడని ఆ ప్రేమ బ్రేక్ అప్ అయ్యాక మానసికంగా కుంగిపోయిన ఆతడు కొన్ని నెలల పాటు బయటకు రాలేదని తెలిపారు. ఆ సమయం లో చిరంజీవి ఉదయ్ ని ప్రోత్సహించి, కెరీర్ పై ద్రుష్టి పెట్టేలా చేసారని తెలిపారు. ఉదయ్ తన పాత జ్ఞాపకాల నుంచి బయట పడ్డ తరువాత తన కుమార్తె సుష్మితని వివాహం చేసుకోవాలని చిరంజీవే స్వయంగా అతడిని అడిగినట్లు తెలిపారు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో కొన్ని కారణాల వలన ఉదయ్ కిరణే ఆ వివాహాన్ని ఆపేసినట్లు అతని సోదరి తెలిపారు. అదంతా తల రాత అని, అందరూ అనుకుంటున్న విధంగా కాదని అన్నారు.

 
Like us on Facebook