‘ఉగ్రం’ టీమ్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Published on May 5, 2023 11:28 pm IST

అల్లరి నరేష్ ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఉగ్రం. మిర్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని విజయ్ కనకమేడల తెరకెక్కించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఉగ్రం మూవీ నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది.

ఇక ఆడియన్స్ తో పాటు అల్లరి నరేష్ ఫ్యాన్స్ నుండి కూడా సినిమా మంచి స్పందన అందుకుంటూ ఉండడంతో ఉగ్రం టీమ్ కొద్దిసేపెటీ క్రితం ఆనందం వ్యక్తం చేస్తూ సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కొద్దిసేపటి క్రితం ఉగ్రం టీమ్ స్పెషల్ గా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా సినిమాని ఉగ్ర విజయ శిఖరాగ్రాన చేర్చిన ఆడియన్స్ అందరికీ ప్రత్యేకంగా థాంక్స్ అని, అలానే నాంది తరువాత మరొక్కసారి తాను మరియు విజయ్ కనకమేడల కాంబినేషన్ అందరినీ ఆకట్టుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని అన్నారు అల్లరి నరేష్.

సంబంధిత సమాచారం :