“సరిపోదా శనివారం” నుండి రిలీజ్ కానున్న ఉల్లాసం సాంగ్!

“సరిపోదా శనివారం” నుండి రిలీజ్ కానున్న ఉల్లాసం సాంగ్!

Published on Jul 11, 2024 5:01 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ఆగస్ట్ 29, 2024న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి ఉల్లాసం సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఉల్లాసం సాంగ్ జూలై 13, 2024న విడుదల కానుంది. నాని మరియు ప్రియాంక అరుల్ మోహన్‌లతో ఉన్న ఈ పోస్టర్‌ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు