చిరు ‘మాట’పై అనవసర రాద్ధాంతం.?

Published on Jan 29, 2023 8:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా లేటెస్ట్ గా నటించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మాస్ మహారాజ రవితేజ కూడా మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ ఓ సాలిడ్ ఎమోషనల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మెగాస్టార్ చరిష్మా ని ఎక్కడా తగ్గించకుండా తీసిన ఈ ఎంటర్టైనర్ మళ్ళీ చిరు రేంజ్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా నిన్న వీరయ్య విజయ సభలో చిరు చెప్పిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. తాను ఈ చిత్రం నాన్ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాగా నిలిచింది అంటూ తాను చెప్పుకున్నారని ఇంకొందరు అంటున్నారు. అయితే అసలు చిరు పక్కాగా వాల్తేరు వీరయ్య మాత్రమే నాన్ ఎస్ ఎస్ ఆర్ లేదా నాన్ RRR వసూళ్లు అందుకున్న సినిమాగా నిలవలేదని ఆ దిశగా సినిమా రన్ అవుతుంది అని తెలిపారు.

దీనితో దానిని పలు రకాలుగా మార్చుకుని పలువురు ఇంతలా రాద్ధాంతం కరెక్ట్ కాదని మరికొందరి వాదన. ప్రస్తుతానికి అయితే సినిమా బాగానే రన్ అవుతుంది. లాంగ్ రన్ లో నిజంగానే ఓవరాల్ గా నాన్ RRR రేంజ్ కి వెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

సంబంధిత సమాచారం :