దేశ వ్యాప్తంగా “RRR” కి యూనానిమస్ రెస్పాన్స్.!

Published on Mar 25, 2022 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ ఎన్టీఆర్ లు హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు తదితర కీలక పాత్రల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నెన్నో అంచనాలు నడుమ ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రం బిగ్స్ స్క్రీన్స్ పైకి వచ్చింది.

మరి ఈ సినిమాపై ఎన్ని అంచనాలు అయితే ఉన్నాయో ఆ అన్ని అంచనాలు కూడా నిలుపుకొని అదిరే రెస్పాన్స్ ని ఇపుడు ఆల్ ఓవర్ ఇండియాలో అందుకోవడం విశేషం గా మారింది. అన్ని భాషల్లో కూడా సినీ విమర్శకులు ప్రముఖులు చూసి ఒకటే యూనానిమస్ రెస్పాన్స్ అని అందిస్తున్నారు. మొత్తానికి అయితే రాజమౌళి ఖాతాలో మరో ష్యూర్ షాట్ సెన్సేషనల్ హిట్ పడ్డట్టు అయ్యిందని చెప్పాలి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ప్రకంపనలు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :