టాక్..రామ్ – బోయపాటిల చిత్రం రిలీజ్ కి ఊహించని చేంజ్?

Published on May 24, 2023 6:07 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా మాస్ దర్శకుడ్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న భారీ మాస్ చిత్రం కోసం తెలిసిందే. మరి రీసెంట్ గానే వచ్చిన ఫస్ట్ థండర్ తో మంచి హైప్ పెంచుకున్న ఈ చిత్రంపై అయితే ఇప్పుడు ఊహించని బజ్ ఆసక్తిగా మారింది.

నిజానికి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది దసరా బరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా సినిమా రిలీజ్ ని ఇంకాస్త ముందే తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మరి అన్నీ సెట్ అయ్యినట్టు అయితే ఈ ఆగష్టు రిలీజ్ కి వీరి సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకాస్త సమయం ఆగి చూస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :