“RRR” రిలీజ్, టీజర్ పై మరో ఊహించని డీటెయిల్స్.!

“RRR” రిలీజ్, టీజర్ పై మరో ఊహించని డీటెయిల్స్.!

Published on Oct 29, 2021 12:40 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అన్ని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఇప్పుడు నడుస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో దర్శకుడు రాజమౌళి ప్రెజెంట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈరోజు ముంబై లో జరగనున్న ఓ ఈవెంట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సమయంలో సినిమా టీజర్ రిలీజ్ లపై ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్ లోనే టీజర్ అనౌన్సమెంట్ ఉంటుంది కానీ ఈరోజే టీజర్ రిలీజ్ ఉండదని తెలుస్తుంది.

అలాగే ఈ ఈవెంట్ దగ్గర రెడీ చేసిన పోస్టర్స్ చూస్తే అందులో ఎక్కడా కూడా సినిమా వచ్చే జనవరి 7నే రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఇవ్వలేదు కానీ జనవరి రిలీజ్ అనే ఉంది. సో జనవరి 7 నుంచి ఈ చిత్రం అదే నెలలో వేరే తేదీకి షిఫ్ట్ అయ్యిందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ ఈవెంట్ సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మరి రాజమౌళి మున్ముందు ఎలాంటి అనౌన్సమెంట్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు