వైరల్ : “కాంతారా” విషయంలో ఊహించని ట్విస్ట్.!

Published on Nov 24, 2022 11:04 am IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కాంతారా” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా థియేటర్స్ లో సాలిడ్ రన్ ని కనబరుస్తుంది. ఇక భారీ వసూళ్లతో రికార్డు గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం లేటెస్ట్ గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి కూడా వచ్చింది. అయితే ఈ చిత్రం రావడంతోనే తమ వీక్షకులకు షాకిచ్చింది.

ఈ సినిమాకి సోల్ అయినటివంటి వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది. దీనితో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ ఇప్పుడు నడుస్తూ ఉండడం గమనార్హం. థియేటర్స్ లో ఉన్న సాంగ్ ఇప్పుడు లేదని పెద్ద రచ్చే నడుస్తుంది. అయితే ఈ సాంగ్ ఇది వరకే కన్నడ నుంచి ఐదేళ్ల కితమే ఒరిజినల్ బీట్ ఉండగా దాని కాపీ రైట్ ఇష్యూ తో ఇప్పుడు ఈ ట్యూన్ ని మేకర్స్ పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ ఊహించని ట్విస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :