‘ఉంగరాల రాంబాబు’ వసూళ్ల వివరాలు !


వరుస పరాజయాల తర్వాత హీరో సునీల్ బోలెడు ఆశలు పెట్టుకుని చేసిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. సినిమా పాజిటివ్ బజ్ తోనే విడుదలైనప్పటికీ మొదటి రోజు తర్వాత కాస్త నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆధరణ చూపలేకపోతున్నారు. మొదటిరోజు కృష్ణా ఏరియాలో రూ. 8. 36 లక్షల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండవరోజు రూ.3.47 లక్షల షేర్ వసూలు చేసి మొత్తంగా రూ.11. 8 లక్షల షేర్ ను నమోదుచేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే రూ. 3.6 కొట్ల గ్రాస్ గా ఉంది. ఒకరకంగా ఇది పర్వాలేదనే ఆరంభమనే చెప్పాలి. కానీ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేకపోవడం, ఇంకో మూడురోజుల్లో భారీ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ థియేటర్లలోకి దిగుతుండటంతో ఫ్యూచర్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.