“విక్రమ్” ను షురూ చేసిన లోకనాయకుడు.!

Published on Jul 16, 2021 3:00 pm IST


లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “విక్రమ్”. మాములుగా కమల్ ఎలాంటి నటులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి దానికి తోడు నటనలో మరింత స్పాన్ ఉన్న మరో ఇద్దరు విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ లాంటి నటులను కూడా యాడ్ చెయ్యడంతో మూవీ లవర్స్ కి సాలిడ్ ట్రీట్ కన్ఫర్మ్ అయ్యింది.

అలా ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ కి కూడా అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు కమల్ ఈ చిత్రం షూట్ ని కూడా రీస్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దర్శకుడు లోకేష్, కమల్ హాసన్ మరియు విజయ్ సేతుపతిలు సహా ఇతర చిత్ర యూనిట్ అంతా కూడా ఒకే ఫ్రేమ్ లో ఇప్పుడు కనిపించారు. దీనితో ఈరోజు నుంచి ఈ చిత్రం షూట్ స్టార్ట్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :