
హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగు సినిమాతోనే అయినా, తమిళంలో హన్సికకు ఎక్కువ పేరు వచ్చింది. పాలరాతి శిల్పం లాంటి హన్సికకు గుడి కూడా కట్టేశారు తమిళ ప్రేక్షకులు. ప్రస్తుతం హన్సిక 7 చిత్రాలలో నటిస్తుంది. అందులో ఆరు తమిళ సినిమాలే కావడం విశేషం. తమిళంలో హన్సిక నటించిన చాలా చిత్రాలు విజయం సాదించడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించలేని పరిస్థితి హన్సికది. తన డైరీ ఫుల్ అయిపొయింది. కొత్త సినిమా ఆఫర్ లను హన్సిక రిజెక్ట్ చేస్తుంది. ఇంతకు మించిన మంచి సమయం మరొకటి లేదని భావించాడు ఒక కిలాడీ(అజ్ఞాత వ్యక్తి). తమిళ దర్శకులకు, నిర్మాతలకు ఫోన్ చేసి హన్సిక డేట్స్ ఇప్పిస్తాను అంటూ డబ్బుల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ విషయం హన్సిక దృష్టికి వచ్చింది. వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేసింది. నా సినిమా & ఫైనాన్స్ విషయాలు మా అమ్మే చూసుకుంది. అని తెలిపింది.