ఎన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకం పై ప్రొడక్షన్ నెం.2గా ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘ఉన్మాది’. ఎన్.ఆర్.రెడ్డి కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. ఎన్.రామారావు నిర్మాత. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను రాజ్ కందూరి ఆవిష్కరించారు. ట్రైలర్‌ను ఎన్.శంకర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేయడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి ఆల్ ధి బెస్ట్“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ “ఇది నా ఫస్ట్ ఫిలిం. రెడ్డి గారు నన్ను చాలా నమ్మి ఈ సినిమాను ఇవ్వడం జరిగింది. అన్ని పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది“ అన్నారు
డైరెక్టర్ ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ “నేను బేసిక్ గా స్వర్గీయ హరికృష్ణ గారికి పెద్ద అభిమానిని, ఓ రకంగా ఆయనే నా ఇన్‌స్పిరేషన్.. ఈ ఉన్మాది సినిమాలో ఒక్కసారైనా ఆయనలా కనిపించాలని ప్రయత్నించాను. ఒక్క క్షణం అలా కనిపించి ఉన్నా నేను సక్సెస్ అయినట్లే. ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్‌గా ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను కలుగ జేస్తుంది. సినిమా చూసి మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను“ అన్నారు.
అల్లు రమేశ్, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్, ఎడిటర్: కె.ఎ.వై.పాపారావు, నిర్మాత: ఎన్.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి.
