బాహుబలి నుండి ప్రభాస్ స్టైలిష్ ఫోటో వైరల్!

బాహుబలి నుండి ప్రభాస్ స్టైలిష్ ఫోటో వైరల్!

Published on Nov 27, 2022 3:03 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆదిపురుష్ జూన్ 16, 2023న థియేటర్లలోకి రానుంది. ప్రభాస్‌ను లార్డ్ రామ్‌గా చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం తరువాత, ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్‌లో కనిపించనున్నాడు.

ఈ సలార్ చిత్రం సెప్టెంబర్ 28, 2023 విడుదలకు లాక్ చేయబడింది. ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలి చిత్రం నుండి నిర్మాతలు ప్రభాస్ స్టైలిష్ ఫోటో ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. అభిమానులు నటుడి కూల్ పిక్‌ని ఇష్టపడుతున్నారు. ఈ సినిమా నుండి మరికొన్ని రిలీజ్ చేయని ఫోటోలను విడుదల చేయమని టీమ్ ను అభ్యర్థిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాలోని పచ్చ బొట్టాసిన పాటలో విడుదలైన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు