అన్ స్టాపబుల్2: ఇంట్రెస్టింగ్ గా సాగిన పవన్ ఎపిసోడ్ పార్ట్1 ప్రోమో!

Published on Jan 27, 2023 7:27 pm IST


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK. మొదటి సీజన్ సక్సెస్ కు ధీటుగా రెండవ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం కి హాజరై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచేశారు మేకర్స్.

తాజాగా పవన్ ఎపిసోడ్ పార్ట్ 1 కి సంబంధించిన ప్రోమో ను ఆహా వీడియో మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఎదురవుతున్న పలు అంశాల పై కూడా ఈ ఎపిసోడ్ లో చర్చించినట్లు ప్రోమో ను చూస్తే తెలుస్తుంది. అంతేకాక బాలయ్య అడిగిన కొన్ని వ్యక్తిగత ప్రశ్నలకు కూడా పవన్ తనదైన శైలి సమాధానాలు తెలిపారు. అయితే ఈ ఎపిసోడ్ కి మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ తేజ్ కూడా రావడం వీడియో లో చూడవచ్చు. ప్రోమో ఫన్ రైడ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫిబ్రవరి 3 వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :