అన్ స్టాపబుల్ 2 : ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ ప్రోమో

అన్ స్టాపబుల్ 2 : ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ ప్రోమో

Published on Dec 17, 2022 7:34 PM IST


నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క తాజా ఎపిసోడ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు యాక్షన్ హీరో గోపీచంద్ కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సూపర్ ఎపిసోడ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు ఆహా వారు. ఇక ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ కూడా తమ సినీ కెరీర్ అలానే పర్సనల్ విషయాలను గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు మనకు ప్రోమోని బట్టి చూస్తే తెలుస్తుంది.

ఇక ప్రోమో మధ్యలో ప్రభాస్, చరణ్ కి ఫోన్ చేసిన సమయంలో ఒరేయ్ చరణ్ నువ్వు నాకు ఫ్రెండ్ వా లేక శత్రువువా అని అనడం, అలానే ప్రభాస్ రాణి ని గురించి చెప్పమని బాలకృష్ణ అడగడం, అనంతరం గోపీచంద్ చెప్పబోతుండడంతో రేపటి నుండి నేను సోషల్ మీడియా హోరు తట్టుకోలేనురా బాబు అంటూ గోపీచంద్ తో ప్రభాస్ అనడం వంటి సరదా అంశాలతో ఈ తాజా ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగినట్లు తెలుస్తోంది. కాగా ఎపిసోడ్ ని డిసెంబర్ 30న ఆహా వారు ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో భారీ స్థాయి వ్యూస్ తో కొనసాగుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు