‘లయన్’తో ‘లైగర్’ ముచ్చట్లు.. ఎపిసోడ్ ప్రసారం ఎప్పుడంటే ?

Published on Jan 9, 2022 9:30 pm IST

నటసింహం బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షో సూపర్ హిట్ అయింది. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి భారీ విజయం సాధిస్తూనే ఉంది. ముఖ్యంగా బాలయ్యను కొత్తగా చూసే సరికి ప్రేక్షకులు కూడా ఈ షో పై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ షో కి గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ‘లయన్’తో ‘లైగర్’ ముచ్చట్లు ఎలా సాగాయో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

కాగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తోన్న ఈ ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోకు ‘లైగర్’ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి కూడా వెళ్లారట. విజయ్ దేవరకొండతో పాటు వాళ్లిద్దరూ కూడా బాలయ్య షోలో పాల్గొన్నారు. కాగా ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఓటీటీ ఆహాలో ప్రసారం కాబోతుంది అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ పై నెటిజన్లు బాగా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య – విజయ్ మధ్య నడిచే ముచ్చట్లు పై ఆసక్తి ఎక్కువ ఉంటుంది.

సంబంధిత సమాచారం :