బాలయ్యతో సినిమా.. రాజమౌళి ఏం చెప్పాడంటే?

Published on Dec 15, 2021 7:42 pm IST

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. షోకి వచ్చే గెస్ట్‌లను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ అందిస్తూ ఇప్పటికే నాలుగు ఎపిసోడ్‌లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. అయితే ఐదో ఎపిసోడ్‌కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, దిగ్గజ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి విచ్చేసినట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాజమౌళిని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ మీరు ఇంటెలిజెంట్‌ అని, అఛీవర్‌ అని అందరికి తెలుసు.. మరీ ఇంకా ఎందుకు ఆ తెల్ల గడ్డం అని, ఇక ఇప్పటిదాక మన కాంబినేషన్‌ పడలేదు, నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగారు. మీ సమాధానం ఏంటి అసలు అని అన్నాడు. ఇక మీతో సినిమా చేస్తే.. హీరోకు, ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు. ఆ తర్వాత వారి నెక్స్ట్ రెండు, మూడు సినిమాలు ఫసక్‌యేగా అని ప్రశ్నించగా రాజమౌళి ఫన్నీ హావాభావాలను పలికిస్తూ సైలెంట్‌గా కూర్చున్నాడు. ఏంటి ‘సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి అని బాలయ్య అడగ్గా ‘మీకూ తెలుసు, నాకూ తెలుసు ఇది ప్రోమో అని సమాధానాలు అన్ని ఎపిసోడ్‌లో చెబుతానని రాజమౌళి బదులిస్తాడు. మరీ బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఫుల్ ఎపిసోడ్‌లో రాజమౌళి ఎలంటి సమాధానాలు చెబుతాడో తెలియాలంటే డిసెంబర్ 17 వరకు ఆగాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :