బాలీవుడ్ బిగ్గీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న కాంతార

బాలీవుడ్ బిగ్గీలకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న కాంతార

Published on Nov 2, 2022 4:00 PM IST

కన్నడ నాట చిన్న చిత్రంగా విడుదలైన కాంతార, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. సౌత్ లో మాత్రమే కాకుండా, హిందీలో కూడా ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేయగా, సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. హిందీ లో రిలీజైన భారీ చిత్రాలకి సైతం కాంతార గట్టి పోటీ ఇస్తోంది. హిందీలో ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా 45 కోట్ల రూపాయల మార్క్‌ని టచ్ చేసి ఇంకా జోరుమీదుంది.

ఈ చిత్రం అక్షయ్ మరియు అజయ్ దేవగన్ వంటి స్టార్లను కలిగి ఉన్న రామ్ సేతు, థాంక్స్ గాడ్ వంటి చిత్రాలను బీట్ చేసింది. హిందీలో ఈ సినిమాకి అంతగా ప్రచారం జరగలేదు, చేసి ఉంటే అవుట్‌పుట్ ఇంకేదో వచ్చేది. తెలుగులోనూ ఈ సినిమా 50 కోట్ల గ్రాస్‌ను దాటేసి అత్యద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. రిషబ్ శెట్టి కాంతారలో నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు