అన్‌స్టాపబుల్ ప్రోమో: ఎమ్మా దేవుడిని ఎవరైనా చూస్తారా – మహేశ్ బాబు

Published on Jan 21, 2022 8:36 pm IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 9 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని ఆహా విడుదల చేసింది.

అయితే ఆడియన్స్ మధ్య కూర్చుని ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో అతడే మహేశ్‌ అంటూ బాలయ్య మహేశ్‌ని స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. దీని తర్వాత బాలయ్య-మహేశ్ మధ్య కొన్ని సరదా మరియు ఎమోషనల్ సంభాషణలు నడిచాయి. ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదని మహేశ్ చెప్పాడు. ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ అని, సితార తాట తీసేస్తది అని అన్నాడు.

ఇక వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి ఎంతో మంది పేదల గుండెల్లో నిలిచిపోయాడు మహేశ్ అని బాలయ్య చెప్పగా, దాని వెనుక ఉన్న కారణాని మహేశ్ చెప్పాడు. తన కుమారుడు గౌతమ్ ఆరువారాల ముందే పుట్టాడని, పుట్టినప్పుడు కేవలం అరచేయి అంతే ఉన్నాడని, తన దగ్గర డబ్బు ఉండడంతో వైద్యం చేయించుకున్నామని, లేని వాళ్ల పరిస్థితి ఏమిటి అని అప్పుడు అనిపించిందని, అందుకే చిన్నారుల కోసం ఏదైనా చేయాలని తన వంతు సాయం చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో సాగిన ఈ ఎపిసోడ్‌కి దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వచ్చి సందడి చేశాడు. మరీ ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఫిబ్రవరి 4 వరకు వేచి చూడక తప్పదు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :